పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సీఆర్ఆర్ మహిళా కళాశాల కొవిడ్ కేర్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఖైదీలు నాగదుర్గా ప్రసాద్, వెంకటనారయణ... ఎట్టకేలకు పట్టుబడ్డారు. దొంగతనాల కేసుల్లో ఏలూరు జిల్లా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వీరిద్దరికీ కరోనా సోకింది. చికిత్స కోసం సీఆర్ఆర్ మహిళా కళాశాల కొవిడ్ కేర్ సెంటర్కు తరలించారు.
ఆ తర్వాత..
ఆ మరుసటి రోజే అక్కడ నుంచి పరారైన నిందితులు దొంగతనాలు మాత్రం ఆపలేదు. మరో నలుగురు దొంగలతో కలిసి భీమవరం, ఏలూరులో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఏలూరులోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వరదరాజులు ఇంట్లోనూ దొంగతనం చేశారు. ఎట్టకేలకు దొంగలిద్దరూ పోలీసులకు చిక్కారు. వారినుంచి 35 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నాయక్ వెల్లడించారు.
ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్టు పూర్తికి అన్ని వనరులను సమీకరించండి: మంత్రి అనిల్