పశ్చిమగోదావరి జిల్లా టీ.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంలో అర్ధరాత్రి సచివాలయ భవనానికి శ్లాబ్ వేశారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సచివాలయ నిర్మాణం చేపట్టారు.
అప్పలరాజుగూడెంలో అర్ధరాత్రి సచివాలయ నిర్మాణం - అప్పలరాజుగూడెంలో అర్ధరాత్రి సచివాలయ నిర్మాణం వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా టీ.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంలో అర్ధరాత్రి సచివాలయ భవనానికి శ్లాబ్ వేశారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని క్రీడా కళాశాల కోసం ఆ స్థలాన్ని కేటాయించమని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు.
అప్పలరాజుగూడెంలో అర్ధరాత్రి సచివాలయ నిర్మాణం
పాఠశాల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని క్రీడా కళాశాల కోసం ఆ స్థలాన్ని కేటాయించాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పనులు నిలిపివేయాలంటూ కోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉందని.. తమకు ఇవేవీ అడ్డుకాదంటూ వైకాపా నేతలు రాత్రికి రాత్రే శ్లాబ్ వేశారు. హైకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి కోట్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామంలోని తెదేపా నాయకులు కోరుతున్నారు.