కరోనా వైరస్ నివారణకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్థానిక శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అధికారులు.. ఆదివారం సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చారు. పాల కేంద్రాలు, ఔషధ దుకాణాలకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్య అవసరాల కోసం వచ్చే వారిని తప్ప.. ఇతరులను పట్టణంలోకి అనుమతించడం లేదు.
కరోనా వ్యాప్తి నివారణకు తణుకులో సంపూర్ణ బంద్ - lockdown in thanuku
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జిల్లాలోని తణుకులో వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆదివారం పట్టణంలో సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చారు.
కరోనా వ్యాప్తి నివారణకు తణుకులో సంపూర్ణ బంద్
నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పట్టణంలోని ఆంక్షలు విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతిచ్చారు. ప్రస్తుతం నిబంధనలకు.. వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే వెంకటనాగేశ్వరరావు కోరారు.
ఇదీచదవండి.