పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుపై తణుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనసభ్యుడు నాగేశ్వరావుపై అసత్య ఆరోపణలు చేసి, ఆయన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రఘురామకృష్ణరాజుపై తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు - ysrcp internal quarrels
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజు పై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వ్యక్తిగత కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నరసాపురం ఎంపీ కనుమూరు పై తణుకులో ఫిర్యాదు
సింహం సింగిల్‌గా వస్తుందని పేర్కొంటూ శాసనసభ్యుని జంతువులతో పోల్చారంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి జంగారెడ్డిగూడెంలో కరోనా కలకలం.. అప్రమత్తమైన అధికారులు