ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయిపేటలో మహిళలకు ముగ్గుల పోటీ - రాయిపేటలో ముగ్గుల పోటీలు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధి రాయిపేటలో వేంచేసి ఉన్న గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా మహిళలకు ముగ్గులపోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

Competition for trio for women
జాతర మహోత్సవంలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు

By

Published : Feb 23, 2020, 4:57 PM IST

జాతర మహోత్సవంలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణ పరిధిరాయిపేటలో వేంచేసి ఉన్న గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు ఎస్ రాజ్యలక్ష్మి, న్యాయవాది కొప్పర్తి వసుంధర, వలపల సరస్వతి వ్యవహరించారు. ఈ పోటీల్లో మహిళల రక్షణను వివరిస్తూ వేసిన 'దిశ' ముగ్గుకి ప్రథమ బహుమతి వచ్చింది. గోగులమ్మ వారి జాతర సందర్భంగా అమ్మవారిని గుర్రపు బండిపై అత్యంత వైభవంగా ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని జాతరను తిలకించారు.

ఇదీ చూడండి:పశ్చిమగోదావరిలో పరమేశ్వరుని పూజలు

ABOUT THE AUTHOR

...view details