సీఎం జగన్ ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరును పరిశీలించడం సహా కార్యాచరణపై అధికారులతో సమీక్షించనున్నారు. మంత్రి అనిల్ కుమార్, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ అధికారులు సమావేశంలో పాల్గొంటారు. తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 9.40 గంటలకు సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి... పదిన్నరకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. 11గంటల 50 నిమిషాల నుంచి సుమారు గంటన్నర పాటు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తిరిగి 2గంటల 25 నిమిషాలకు తాడేపల్లి చేరుకుంటారు
నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ - పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ వార్తలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్
Last Updated : Dec 14, 2020, 3:34 AM IST