ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసాపురం వ్యవహారంపై సీఎం సీరియస్‌: ఉమ్మారెడ్డి

నరసాపురం ఘటనను ముఖ్యమంత్రి చాలా సీరియస్‌గా తీసుకున్నారని వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరు తొందరపడ్డారనే అంశంపై జగన్ విచారణ చేయిస్తున్నారని వెల్లడించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు.

ycp leader ummareddy
ycp leader ummareddy

By

Published : Jun 17, 2020, 5:59 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. నరసాపురం వ్యవహారాన్ని సీఎం చాలా సీరియస్‌గా తీసుకున్నారని వెల్లడించారు. ఇలాగే మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు.

'పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకూడదని జగన్‌ స్పష్టం చేశారు. ఆ పరిస్థితి వస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని సీఎం గట్టిగా చెప్పారు. నాయకులు ఛాలెంజ్‌లు చేసుకోవద్దు.... పార్టీ ఆదేశం మేరకే మీడియా సమావేశం పెట్టాలని సీఎం చెప్పారు. ఎవరు తొందరపడ్డారనే విషయంపై జగన్ విచారణ చేయిస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవు. పార్టీపరంగా ప్రకటిస్తున్నాం, రఘురామకృష్ణరాజుకు ఇదే నోటీసుగా పరిగణించాలి. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే ఆరోపణ సరికాదు' అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details