ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూళ్లలో వింత వ్యాధి.. సీఎం ఆదేశాలతో కొమరేపల్లికి సీఎస్​

పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో వింత వ్యాధిపై.. వాస్తవాలు తెలుసుకునేందుకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. కొమరేపల్లిలో పర్యటించారు. అంతకుముందు.. ముఖ్యమంత్రి జగన్ సమీక్షకు ఆయన హాజరయ్యారు. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

cm jagan on pulla unknown disease
cm jagan on pulla unknown disease

By

Published : Jan 22, 2021, 1:45 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో అంతు చిక్కని వ్యాధిపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఉదయం ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్.. తక్షణం అక్కడకు వెళ్లి సమీక్షించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సహా వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆ శాఖ కమిషనర్ కె.భాస్కర్.. కొమరేపల్లి చేరుకున్నారు.

అక్కడ నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో వివరాలు తెలుసుకున్నారు. కొమరేపల్లితో పాటు.. పూళ్లలో సీఎస్‌, వైద్యారోగ్య శాఖ అధికారులు పర్యటించి తాజా పరిస్థితిని పరిశీలించనున్నారు. ప్రస్తుతం కొమరేపల్లి వైద్య శిబిరంలో 10 మంది వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. వారు చెప్పిన వివరాలను సీఎస్ బృందం నమోదు చేసుకుంది. మరోవైపు.. కొమరేపల్లి, పూళ్ల గ్రామాల్లో అధికారులు రెండు బృందాలుగా విడిపోయి నమూనాలు సేకరిస్తున్నారు.

వింత వ్యాధి బాధితుల రక్తం, వాళ్లు తాగుతున్న నీరు, వండుకుంటున్న కూరగాయలు, ఇతర పదార్థాల నమునాలు సేకరించనున్నారు. వింత వ్యాధిపై అధ్యయనం కోసం విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. ఈ బాధ్యతలు తీసుకుంది.

ఇదీ చదవండి:

అంతుచిక్కని వ్యాధితో 21 మంది అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details