ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

7న పశ్చిమ గోదావరి జిల్లాకు సీఎం జగన్ - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7న పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లనున్నారు. గోపాలపురం ఎమ్యెల్యే తలారి వెంకటరావు కూతురు వివాహ వేడుకకు హాజరుకానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు.

cm jagan
cm jagan

By

Published : Dec 2, 2020, 5:55 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గోపాలపురం ఎమ్యెల్యే తలారి వెంకటరావు కూతురు వివాహ వేడుకకు హాజరుకానున్నారు. గోపాలపురం పొగాకు వేలం కేంద్రం వద్ద ఈ వివాహ వేడుక జరగనుంది.

అధికారులతో కలెక్టర్ సమీక్ష

సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులతో కలెక్టరేట్​లో సమావేశమయ్యారు. సంయుక్త కలెక్టర్ వెంకటరామిరెడ్డి, ఎస్పీ నారాయణనాయక్, వైద్య, రెవెన్యు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హెలీపాడ్ , బందోబస్తు ఇతర ఏర్పాట్లపై చర్చించారు. దేవరపల్లిలో హెలిపాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details