ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిటైనింగ్ వాల్​ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన - సీఎం జగన్

జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరు కాలువ రిటైనింగ్ వాల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు నగర మాజీ మేయర్ నూర్జహాన్ పెదబాబు కుమార్తె వివాహానికి హాజరయ్యారు.

cm jag an inaugurate retaining wall constrictions works
రిటైనింగ్ వాల్​ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన

By

Published : Nov 4, 2020, 5:14 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అల్లూరి సీతారామరాజు స్టేడియంలో హెలికాప్టర్​లో దిగిన జగన్... అక్కడనుంచి ప్రత్యేక వాహనంలో వెళ్లారు. తమ్మిలేరు కాలువకు సంబంధించిన రిటైనింగ్ వాల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జగన్​తోపాటు మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకూరి రంగరాజు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఏలూరు నగర మాజీ మేయర్ నూర్జహాన్ పెదబాబు కుమార్తె వివాహానికి హాజరైన జగన్

వివాహ వేడుకలో సీఎం..

ఏలూరు నగర మాజీ మేయర్ నూర్జహాన్ పెదబాబు కుమార్తె వివాహానికి జగన్ హాజరయ్యారు. మంత్రులు, పలువురు పార్టీ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేదిక వద్ద కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details