ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..ఒకరికి తీవ్రగాయాలు - narasapuram

పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం గండిగూడెం గ్రామంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

By

Published : Aug 6, 2019, 4:08 PM IST

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

పశ్చిమగోదావరి జిల్లా గండిగూడెం గ్రామంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. గత 3రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంత రహదారులు మొత్తం అధ్వానంగా మారాయి. ఆ గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చింతలపూడి నుంచి గండిగూడెం మీదుగా ఏలూరు వెళుతోంది. ఈ క్రమంలో గండిగూడెం గ్రామ శివారులో రహదారి ఇరుకుగా ఉండటంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపు తప్పి.. పంట కాలువలోకి దూసుకెళ్లినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలుకాగా పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details