పశ్చిమగోదావరి జిల్లాలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
21:02 September 21
suicde btech breaking
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం చెరుకువాడలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థి విశ్వేశ్వరరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విశ్వేశ్వరరావు ఆన్లైన్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అయితే విద్యార్థి సెల్ఫోన్లో.. అ కంపెనీ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు చాటింగ్ బయటపడింది. అందులో మీకు ఇచ్చిన పని పూర్తి చేయలేదంటూ..రూ.1.40 లక్షలు గంటన్నరలో చెల్లించాలని కంపెనీ బెదిరింపులకు పాల్పడింది. అప్పటికే కొంత మెుత్తాన్ని విద్యార్థి చెల్లించాడు. మిగిలిన మెుత్తాన్ని చెల్లించాలంటూ ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురావటంతో ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెనుగొండ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: