పశ్చిమ గోదావరి జిల్లాలో.. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం సంఘటన్ పర్వ్కు.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణంరాజు హాజరయ్యారు. భీమవరంలో సభ్యత్వ నమోదు తీరును పరిశీలించారు. ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరేందుకు చాలామంది నాయకులు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. జిల్లాలో రెండు లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు.. ఓ ముఖ్యమంత్రిగా కేంద్రంతో ఎలా వ్యవహరించాలో తెలియదని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తెలుగు వారందరికీ న్యాయం జరిగేలా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుచుకోవాలని సూచించారు.
'ఆయనకు కేంద్రంతో ఎలా ఉండాలో తెలియదు' - west godavari
సభ్యత్వ నమోదును పరిశీలించడానికి భాజపా సీనియర్ నాయకుడు కృష్ణంరాజు భీమవరంలో పర్యటించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీరును తప్పుబట్టారు.
భీమవరంలో సభ్యత్వ నమోదు