రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లు, రీచ్ల వద్ద భాజాపా ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం ఇసుక స్టాక్ పాయింట్ వద్ద భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. ఇసుక దందాకు సీఎం అండ, ఇసుక కొరత సీఎం ఘనత అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గనుల శాఖ మంత్రి చెప్పినట్లు ఇసుక పాయింట్లో వ్యత్యాసం ఉందంటున్న దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కార్మికుల పొట్టగొడుతున్న సీఎం... ఇసుకపై సరైన మార్గదర్శకాలు సూచించాలని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాల రావు డిమాండ్ చేశారు.
ఇసుక రీచ్ల వద్ద భాజపా ధర్నా - bjp dharna latest news update
నవరత్నాలకు మాత్రమే ప్రాముఖ్యతనిచ్చి ఇసుక కొరతను పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లు, రీచ్ల వద్ద భాజాపా ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు.
ఇసుక రీచ్లల వద్ద భాజపా ధర్నా