ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనసులో స్థానం.. ఇంట్లోనూ సగభాగం

సాంకేతికత పెరుగుతోంది. వాటి చుట్టే జీవితం తిరుగుతోంది. ఆధునీకరణ పేరుతో సాంప్రదాయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంపాదన ధ్యేయంగా బతుకుతూ జీవనం సాగిస్తున్న ఈరోజుల్లో.. ఓ వ్యక్తి తన ఇంట్లో కొంత భాగాన్ని పక్షులకు కేటాయించాడు. కొంత సమయాన్ని వాటికి కేటాయిస్తున్నాడు.

birds-lover-in-west-godavari-district-thadepalligudem
birds-lover-in-west-godavari-district-thadepalligudem

By

Published : Mar 3, 2020, 3:24 PM IST

మనసులో స్థానం.. ఇంట్లోనూ సగభాగం

ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి దారి వారిదే. పక్కవాళ్ల గురించి పట్టించుకునే సమయం, తీరికే ఉండదు. కానీ ఓ వ్యక్తి పక్షుల గురించి కూడా ఆలోచించాడు. వాటికోసం ఇంట్లో స్థలాన్ని కేటాయించాడు. రామచిలుకలతో బంధం పెంచుకున్నాడు. వాటికి మాటలు నేర్పాలని చూస్తున్నాడు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సీనియర్ ఎలక్ట్రికల్ లైన్​మెన్​గా పనిచేసే దూదే వెంకటేశ్వరరావు విద్యుదాఘాతానికి గాయపడే పక్షులను చూసి బాధపడేవాడు. వాటికి రక్షణ కల్పించాలని మనసులో అనుకున్నాడు. తన ఇంట్లో ఆవాసాన్ని ఏర్పాటు చేశాడు. పరిసర ప్రాంతాల్లోని పొలాలకు వెళ్లి.. వరి కంకులు తెచ్చి వాటికి మేతగా వేస్తున్నాడు.

తొలినాళ్లలో 5 నుంచి 10 వరకు రామచిలుకలు వచ్చేవి. ఇప్పుడు 30 నుంచి 40 వరకు వచ్చి ఆహారం తింటున్నాయి. రామచిలకలు ఆహారం తీసుకుంటుంటే.. చిన్న పిల్లలు వచ్చి ఆనందంగా చూస్తున్నారని వెంకటేశ్వరరావు చెబుతున్నాడు. సాధ్యమైనంతవరకు ఆ పక్షులకు తన మాటలతో శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. తాను చేసే ఈ పనికి కుటుంబ సభ్యుల నుంచి మంచి తోడ్పాటు ఉందని వెంకటేశ్వరరావు వెల్లడించాడు.

ఇదీ చదవండి: భర్త నమ్మకమే నిజమైంది.. 14ఏళ్లకు తిరిగొచ్చింది

ABOUT THE AUTHOR

...view details