పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బ్యాంకు మేనేజర్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. నీలకంఠ పవన్ సాయి అనే వ్యక్తి.. హైదరాబాద్ కోఠిలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేశారు. ప్రగతి నగర్లో నివాసముంటున్నారు. తన ఇద్దరు కుమారులతో ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం బయలు దేరారు.
తెల్లవారుజామున 5 గంటల సమయంలో కైకరం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్కన కూర్చున్న పవన్ సాయి అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక సీట్లో కూర్చున్న ఆయన కుమారులు గాయపడ్డారు. కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.