ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా బంద్​ - పశ్చిమగోదావరిలో బంద్​ సమాచారం

విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చేపడుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా జరుగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ సంస్థలను మూసివేసి బంద్​కు పిలుపునిస్తున్నారు.

bandh
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్​

By

Published : Mar 5, 2021, 3:46 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న బంద్​ కార్యక్రమం.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. వర్తక, వాణిజ్య సంస్థల దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తణుకు నుంచి అరవై సర్వీసులు నిలిచిపోయాయి.

తణుకులో అధికార వైకాపాతో పాటు తెదేపా, ఇతర వామపక్ష నేతలు నిరసనలో పాల్గొన్నారు. కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 37మంది బలిదానాలతో ఎందరో ప్రజాప్రతినిధుల త్యాగాలతో కాపాడుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని.. అదే స్ఫూర్తితో కాపాడుకునేందుకు ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండీ..విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ.. రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

ABOUT THE AUTHOR

...view details