పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగుమిల్లి మండలంలోని రౌతు గూడెం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ దాడులను జంగారెడ్డి గూడెం స్పెషల్ డ్యూటీ ఎఫ్ఎస్ఓ నాగవాసు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. రౌతు గూడెం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు.. సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు నాగవాసు నాయుడు వెల్లడించారు. సీజ్ చేసిన వాహనాలను జంగారెడ్డిగూడెం అటవీ శాఖ కార్యాలయానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్ - పశ్చిమ గోదావరిలో నాలుగు ట్రాక్టర్ల సీజ్ న్యూస్
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగుమిల్లి మండలం, రౌతుగూడెం సమీపంలో జరిగింది.
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్ల సీజ్