అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గ్రామ శివారులోని ఘటాలదిబ్బకు చెందిన గుత్తుల రమేశ్ భార్య గుత్తుల కల్పన పేరిట స్థలం మంజూరు అయింది. దీనికోసం స్థానిక వైకాపా నాయకులకు మార్చి నెలలో రమేశ్ రూ.50,000 చెల్లించాడు. ఇటీవల జిల్లాలో ఇళ్ల స్థలాల అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. కాగా... బాధితుడు గత నెల 30న టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఈనెల ఒకటో తేదీన స్థానిక తహసీల్దార్ రవికుమార్.. గ్రామానికి వచ్చారు. ఇదే సమయంలో తహసీల్దార్‌ను కలిసేందుకు వచ్చిన రమేశ్‌పై అక్కడ ఉన్న వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే దాడి చేశారు
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో అక్రమ వసూళ్లపై ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన పెనుగొండ మండలం సిద్దాంతంలో జరిగింది.
సిద్దాంతం గ్రామంలో ఫిర్యాదు దారులపై వైకాపా కార్యకర్తల దాడి