ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాపం పండింది... అత్యాచార నిందితుల అరెస్ట్ - west goadavari

వివాహిత అత్యాచారం ఏలూరులో కలకలం రేపింది. పుట్టింటికి ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఆ దారుణం జరిగింది. మృగాళ్లు పోలీసులకు చిక్కారు.

పాపం పండింది... అత్యాచార నిందితుల అరెస్ట్

By

Published : Jun 7, 2019, 4:16 AM IST

వివాహితపై అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ఏలూరులోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఓ వివాహిత తన పుట్టింటికి శుభ కార్యక్రమ నిమిత్తం వచ్చింది. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి ఇ పెదపాడు మండలం గ్రామం నుంచి పెదపాడుకు వెళ్లే రోడ్డు మార్గంలో మాట్లాడుతోంది. ఈక్రమంలో వట్లూరు గ్రామానికి చెందిన వన్నెకూటి నవీన్, కొమ్మి నా అనిల్ కుమార్, పోలిమెట్ల దుర్గారావు ఆటోలో వచ్చారు. ఈ జంటని గమనించారు. ఒకేసారి దాడికి తెగబడ్డారు. భయంతో వివాహిత స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నవీన్ ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత మిగిలిన ఇద్దరూ అత్యాచారం చేసేందుకు సిద్ధమవుతుండగా... వివాహిత వారినుంచి తప్పించుకుని ఇంటికి వచ్చి విషయాన్ని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐ సురేష్ కేసును మూడురోజుల్లోనే ఛేదించారు. ఆటోని స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

పాపం పండింది... అత్యాచార నిందితుల అరెస్ట్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details