ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాంతం ఒకటే.... నియోజకవర్గాలే వేరు!!

ఆ ప్రాంతంలోని వారంతా రోజూ కలిసే ఉంటారు. వారి ఇళ్లూ పక్క పక్కనే ఉంటాయి. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి ఓ విషయం గుర్తొస్తుంది. తాము ఒకే గ్రామ పంచాయితీ, ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కాదు అని. చెప్పుకొనేందుకు ఒకే చోట ఉంటున్నా.. ఓటు మాత్రం వేర్వేరు నియోజకవర్గాలకు వేయాల్సి వస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో గల బురాయి గూడెం ప్రజలు ఈ వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ప్రాంతం ఒకటే.... నియోజకవర్గాలే వేరు!!

By

Published : Apr 8, 2019, 8:41 AM IST

ఆ ప్రాంతంలోని వారంతా రోజూ కలిసే ఉంటారు. వారి ఇళ్లూ పక్క పక్కనే ఉంటాయి. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి ఓ విషయం గుర్తొస్తుంది. ఉండేది ఒకే చోటే అయినా... తాము ఒకే గ్రామ పంచాయితీ, ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కాదు అనే విషయం వారికి స్ఫురిస్తుంది. చెప్పుకొనేందుకు ఒకే చోట ఉంటున్నా.. ఓటు మాత్రం వేర్వేరు నియోజకవర్గాలకు వేయాల్సి వస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో గల బురాయి గూడెం ప్రజలు ఈ వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

పంటకాలవే ఆ ఊరును రెండుగా విడదీసింది!
బురాయిగూడెంలో ఓ పంటకాలువ ప్రవహిస్తోంది. ఆ కాలువకు ఒకవైపు భాగమంతా ఏలూరు గ్రామీణ మండలం వెంకటాపురం గ్రామపంచాయితీ పరిధిలోకి వస్తుంది. కాలువకు మరోవైపు పెదపాడు మండలం కొత్తూరు పంచాయితీ పరిధిలోకి వస్తుంది. ఈ కారణంతోనే ఆ ప్రాంతం రెండు గ్రామ పంచాయితీలుగా విడిపోయింది. 90 శాతం వెంకటాపురం గ్రామపంచాయితీ పరిధిలోకి, మరో 10 శాతం కొత్తూరు పరిధిలోకి వస్తుంది.
వెంకటాపురం గ్రామస్థులంతా ఏలూరు నియోజకవర్గానికి చెందుతారు. కొత్తగూడెం గ్రామస్థులు దెందులూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తారు. ఇలా... ఒకే ప్రాంతంలో నివిసిస్తూ ఉన్నా.. ఊరు,మండలం, నియోజకవర్గాలు వారికి వేరుగా ఉన్నాయి. బురాయిగూడెం పరిధిలో సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉంటారు. ఎన్నికలు వచ్చేసరికి వారంతా.. వేరు వేరు నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details