ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటే లక్ష్యం' - minister alla nani news

రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నట్లు వెల్లడించారు.

'ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటే లక్ష్యం'
'ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటే లక్ష్యం'

By

Published : Jul 13, 2020, 1:31 PM IST

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో రూ.75 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. బుట్టాయిగూడెం సామాజిక ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. సీజనల్​ వ్యాధులపై కలెక్టర్​, జిల్లా వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయన్న మంత్రి.. మరో 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details