డ్రిప్ ఇరిగేషన్‌పై రైతులకు సబ్సిడీ సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీలుగుమిల్లి మండలంలోని పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం, ములగలంపల్లి గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు.. పొగాకు, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. గత ప్రభుత్వ కాలంలో ఐదెకరాల లోపు రైతులకు 90 శాతం, ఐదు ఎకరాలు దాటిన వారికి 75 శాతం, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు జరిగిందని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు చేయకపోవడం వల్ల రైతాంగ ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
'డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కల్పించి రైతులు ఆదుకోండి' - west godavri latest news
సబ్సిడీపై ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ పథకం ఎత్తివేయడం వలన ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం వెంటనే సబ్సిడీ సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కోసం రైతులు వేచి చూస్తున్నారని శ్రీనివాస్ అన్నారు.
పొగాకు, మొక్కజొన్న ఆయిల్ పామ్ కూరగాయలు తదితర పంటల సాగుకు డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. అయితే సబ్సిడీపై ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ పథకం ఎత్తివేయడం వలన ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు కోరుతూ ఈ నెల 23న ఛలో విజయవాడ, 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏలూరులో రైతు పరేడ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహిళల నేతృత్వంలో రైతు ఆందోళనలు