ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా ఆంజనేయ స్వామి ఏకాహం మహోత్సవం - westgodavari district newsupdates

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో వేంచేసి ఉన్న అంజనేయ స్వామి ఆలయంలో ఏకాహం మహోత్సవాలు జరుగుతున్నాయి.

Anjaneya Swami Ekaha Mahotsavam in glory
వైభవంగా ఆంజనేయ స్వామి ఏకాహ మహోత్సవం

By

Published : Feb 23, 2021, 3:28 PM IST

Updated : Feb 23, 2021, 8:00 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో వేంచేసి ఉన్న అంజనేయ స్వామి ఏకాహం మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏకాహం మహోత్సవం రోజున స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని.. సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కోరికలు తీరడానికి పటిక బెల్లం తులాభారాలను మొక్కుకుంటారు. సంతాన ప్రాప్తికోసం మొక్కుకున్నవారు పుట్టిన పిల్లలకు సమానమైన బరువున్న పటిక బెల్లం స్వామివారికి సమర్పిస్తారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ తులాభారం వేసి స్వామివారికి పటిక బెల్లం సమర్పించుకుంటారు. భీష్మ ఏకాదశి పర్వదినాలలో స్వామివారికి ప్రతియేటా ఏకాహా మహోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి ఒక్కరోజులోనే సుమారు రెండున్నర టన్నుల పటిక బెల్లం భక్తులు సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వైభవంగా ఆంజనేయ స్వామి ఏకాహం మహోత్సవం

ఇదీ చదవండి: రమణీయం.. నీలకంఠుడి రథోత్సవం

Last Updated : Feb 23, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details