పశ్చిమగోదావరి జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా 10 కమిటీల అధ్యక్ష పదవులు మహిళలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆశావహులు కొంత నిరాశకు గురయ్యారు. మహిళలకు కేటాయించిన కమిటీలలో ఉపాధ్యక్ష పదవిపై దృష్టి సారించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు తేదీలు ఖరారు చేశారు. అయితే, వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం ఎన్నికలకు ముందు చేస్తారా? తర్వాత చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవులపై ఆశావహుల దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకానికి రిజర్వేషన్లు ఖరారు చేయటంతో.. రాజకీయ వాతావరణం మరింత ఊపందుకుంది. ఈ నియామకాలు నామినేటెడ్ పద్ధతిలో జరగనున్నందున.. ఆశావహులు అధినేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నికలు