తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ర్యాలీ చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ తలపెట్టారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ ఆర్కేను అరెస్టు చేసి వాహనంలో తరలించారు.