Accident: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నిద్రలోనే తండ్రి, కుమారుడు మృతి - ఏపీలో ప్రమాదం
08:26 August 28
ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంకలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తండ్రీకుమారుడు సజీవ దహనం అయ్యారు. స్థానికులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మిడి నాగరాజు ఇంట్లో తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో నిద్రిస్తున్న బొమ్మిడి నాగరాజు(35), కుమారుడు రోహిత్ కుమార్(6) సజీవ దహనమయ్యారు.
తెల్లవారుజామున ఇంట్లో నుంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు.. చూసేసరికి నిద్రిస్తున్న తండ్రీకొడుకులు సజీవదహనమై కనిపించారు. భార్య.. బంధువుల వివాహానికి ఊరెళ్లడంతో ఇంట్లోనే కుమారునితో కలిసి నాగరాజు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.