ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్షల జీతం తీసుకుంటూ..లంచానికి అలవాటు పడ్డారు! - acb_rides_on_electricity_department_officers

లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అనిశా దాడులతోనూ అవినీతి అధికారుల తీరు మారడం లేదు. తాజాగా విద్యుత్ శాఖలో ఏడిఈ బీవీ గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కారు.

acb_rides_on_electricity_department_officers

By

Published : Jun 19, 2019, 8:44 AM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో విద్యుత్ శాఖ ఏడీ బీవీ గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు దొరికిపోయాడు. చింతలపూడి మండలంలోని చింతంపల్లి గ్రామానికి చెందిన చిట్టి రెడ్డి హరినాగప్రసాద్ రెడ్డి అనే రైతు తన తల్లి పేరు మీద ఉన్న ఏడున్నర ఎకరాల భూమిలో బోరుబావి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబంధించి 34వేల వరకు డీడీ రూపంలో నగదు చెల్లించారు. విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం ఏడీఈ గోపాలకృష్ణ 20వేల లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో కనెక్షన్ మంజూరులో జాప్యం చేశారు. చేసేది లేక రైతు అవినీతి నిరుధక శాఖాధికారులకు సమాచారం అందించారు. రైతు నుంచి 20 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో గోపాలకృష్ణను అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విజయవాడ అనిశా కోర్టులో హాజరు పరిచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details