పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన చంద్రశేఖర్‌కి క్రికెట్ అంటే మహా అభిమానం. స్వర్ణకారుడైన చంద్రశేఖర్... ఆ అభిమానంతోనే ప్రపంచకప్ సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా తయారుచేయాలని నిర్ణయించుకొన్నాడు. ఆరు గంటలు శ్రమించి.. బంగారు ప్రపంచకప్ తయారు చేశాడు. వృత్తిపరంగా స్వర్ణకారుడైన చంద్రశేఖర్.. ప్రపంచ కప్‌లో భారత్ సెమీఫైనల్ చేరినందున తన అభిమానాన్ని చాటుకోవడానికి ఈ కప్‌ను రూపొందించాడు.
ఈ చిట్టి క్రికెట్ ప్రపంచ కప్ చూశారా?
క్రికెట్‌పై ఉన్న అభిమానానికి తన హస్తకళా నైపుణ్యాన్ని జత చేసి... చిట్టి ప్రపంచకప్ తయారుచేశాడు మన ఆంధ్రా స్వర్ణకారుడు. 200 మిల్లీ గ్రాముల బంగారంతోనే.. ఆరే గంటల్లో ఈ కళాఖండాన్ని రూపొందించాడు. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చూసేయండి.
బంగారు కప్
కేవలం రెండు గ్రాముల బంగారంతో ప్రపంచకప్‌ను పోలిన.. సూక్ష్మ ప్రపంచకప్‌కు జీవం పోశాడు.. ఈ యువకుడు. ఈ కప్ కోసం 200 మిల్లీ గ్రాముల బంగారం వాడాననీ... కేవలం 700 రూపాయలే ఖర్చు అయిందని చంద్రశేఖర్ తెలిపాడు.