పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం వంక బొత్తాపగూడేనికి చెందిన ఓ మహిళ ప్రియుడి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన శివాజీ, ఆమె గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శివాజీకి ఇటీవల మరో మహిళతో నిశ్చితార్థం జరిగింది. మనస్తాపంతో ప్రియురాలు అతని ఇంటి ముందే పురుగుల మందు తాగింది. ప్రియుడు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో ఇదే గొడవపై కేసు నమోదైంది. శివాజీ ఈ మధ్యే బెయిల్పై బయటికి వచ్చాడు. ఈ వివాదంతో పోలీసులు ఆతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి ఆత్మహత్యాయత్నం - west godavari district
ప్రియుడి ఇంటి ముందు ఓ మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. పోలీసులు ప్రియుణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి ఆత్మహత్యాయత్నం