ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభాస్‌ పుట్టినరోజు వేడుకల్లో విషాదం... విద్యుదాఘాతంతో యువకుడు మృతి - prabhas fan died with electric shock at ln puram

ప్రముఖ సినీనటుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతున్న ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఎల్ఎన్​పురం గ్రామంలో జరిగింది.

a boy died with electric shock do while tie favorite hero flexi in lnpuram west Godavari
అభిమాని పుట్టినరోజు వేడుకల్లో విషాదం... విద్యుదాఘాతంతో యువకుడు మృతి

By

Published : Oct 23, 2020, 7:15 PM IST

సినీనటుడు ప్రభాస్ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఎల్ఎన్​​పురం గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన నలుగురు యువకులు హీరో ప్రభాస్ ఫ్లెక్సీ కడుతున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు వైర్లకు తగిలి కరెంట్​ షాక్​కు గురయ్యారు. ఈ ప్రమాదంలో గండికోట దుర్గాప్రసాద్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దుర్గాప్రసాద్​ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విగత జీవిగా ఉన్న కొడుకుని చూసిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details