ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు మరణించిన ఘటన ఉండ్రాజవరంలో చోటు చేసుకుంది.
మూడేళ్ళకే అనంతలోకాలకు...
By
Published : Sep 11, 2019, 12:01 PM IST
మూడేళ్ళకే అనంతలోకాలకు...
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం ఉండ్రాజవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాల బస్సు ఢీ కొట్టడంతో మూడేళ్ల బాలుడు సున్నా లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కుమారుడిని పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి రాగా.. ఆమెతో పాటు వచ్చిన బాలుడు బస్సు కింద పడి మృతి చెందాడు. బాలుడి మృతదేహం దగ్గర తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.