పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రులో రేషన్ బియ్యం అక్రమ తరలింపును విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి లారీలో కాకినాడకు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు.. విజిలెన్స్ అధికారులు కలపర్రు టోల్‌గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. లారీతో సహా చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అరెస్ట్ చేశారు.
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. లారీ డ్రైవర్ అరెస్ట్ - 250 quintals ration rice confiscation
పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి లారీలో కాకినాడకు వెళ్తున్న అక్రమార్కులను గుర్తించి.. అడ్డుకున్నారు.
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత