పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంకు ఆనుకొని ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారి గుంతలు పడి అధ్వానంగా మారింది. అడుగు లోతు గుంతలు పడినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
ప్రమాదాలకు నిలయంగా 16వ నెంబర్ జాతీయ రహదారి
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఉన్న జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. అడుగు లోతు గుంతలు పడినా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ గోతుల వలన వాహనాలు ప్రమాదాలకు గురవటమే కాకుండా... త్వరగా పాడైపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలు
పెరవలి నుంచి తణుకు మీదుగా దువ్వ వెళ్లే మార్గం చాలా వరకు గుంతలు పడి ఉండటంతో.. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ గుంతల వలన ప్రమాదాలే కాకుండా.. వాహనాలు సైతం పాడైపోతున్నాయని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి.. రహదారిని బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:సీఎం సార్..వరద బాధిత కుటుంబాలను ఆదుకోండి: సీపీఎం మధు