పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో ఈనెల 14న అశ్లీల నృత్యాలు నిర్వహించిన 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలోని ఓ వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలను నిర్వహించడంపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, డీఎస్పీ రామాంజనేయరెడ్డి, సీఐ బి.నాగేశ్వర నాయక్‌లు పాలకోడేరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఎవరైనా అశ్లీల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజనేయరెడ్డి హెచ్చరించారు.
అశ్లీల నృత్యాలు నిర్వహించిన 13 మంది అరెస్ట్
అశ్లీల నృత్యాలను నిర్వహించిన 13 మందిని పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలోని ఓ వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలను నిర్వహించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా అశ్లీల, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చిరించారు.
అశ్లీల నృత్యాలు నిర్వహించిన 13 మంది అరెస్ట్