ఎన్నిక ఏదైనా.. అభ్యర్థులు ఎవరైనా.. మహిళల ఓట్లే నిర్ణయాత్మకం. పంచాయతీ ఎన్నికల్లోనూ వీరి నిర్ణయమే తీర్పుకు కారణం.. విజయనగరం జిల్లాలో స్త్రీ ఓటర్లు ఎక్కువగా ఉండటమే. దాంతో నామినేషన్ల పర్వం ప్రారంభం కాకుండానే అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాజకీయ పార్టీలు మహిళల ఓట్లను తమ వైపు ఎలా తిప్పుకోవాలా అని సమాలోచనలు చేస్తున్నాయి. జిల్లాలోని 34 మండలాల్లో 24 చోట్ల అతివలే తమ ఓటుతో సర్పంచి, వార్డు సభ్యుల భవిష్యత్తును నిర్దేశించనున్నారు.
24 మండలాల్లో మహిళలదే హవా.. గెలుపోటములు వారి చేతిలోనే - ఎన్నికల వార్తలు
విజయనగరం జిల్లాలో 24 మండలాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల తలరాతను నిర్ణయించనున్నారు. అందుకే వారిని ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
గెలుపోటములు మహిళల చేతిలోనే