స్పందన కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నం - attempt
కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నంచేసింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపం చెందిన ఆ మహిళ...3 నెలలుగా భర్తపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్పందన కార్యక్రమానికి వచ్చి చీమల మందు తాగిన మహిళను అధికారులు ఆసుపత్రికి తరలించారు.
suicide
విజయనగరం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.బొబ్బిలి మండలం అలజంగికి చెందిన వసుంధర...ప్రేమించి పెళ్లి చేసుకుంది.గత కొన్ని రోజులుగా భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపం వ్యక్తం చేసింది. 3నెలలుగా భర్తపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది.స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆమె...చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.స్పందించిన అధికారులు.... 108వాహనంలో ఆసుపత్రికి తరలించారు.