ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

108 వాహనంలో ఆస్పత్రికి వెళ్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రసవం - vizianagaram latest news

విజయనగరం జిల్లా గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే. వైద్యం కోసం సమీప ఆసుపత్రికి రావాలంటే డోలీలే వారికి దిక్కు. సదుపాయం ఉన్నా.. ఛిద్రమైన రహదారిపై వాహనాల్లో ప్రయాణించాలంటే గంటల వ్యవధిపడుతుంది. జిల్లాలోని పెండ్రింగి గ్రామానికి చెందిన ఓ మహిళకు ఆదివారం రాత్రి నొప్పులు వచ్చాయి. 108లో సమీప ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం అయ్యింది.

108 వాహనంలో ఆస్పత్రికి వెళ్తుండగా

By

Published : Oct 28, 2019, 11:23 PM IST

మార్గమధ్యలోనే ప్రసవం....అంబులెన్స్​లో పుట్టిన బిడ్డ
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పెండ్రింగి వలస గ్రామంలో కోనబోయిన సంధ్య అనే గిరిజన మహిళకు ఆదివారం రాత్రి ప్రసవ నొప్పులు వచ్చాయి. కుటుంబసభ్యులు వెంటనే 108 ఫోను చేశారు. 108 వాహనంలో సంధ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా జీగిరం గ్రామ సమీపంలో ప్రసవించింది. అనంతరం తల్లి బిడ్డను సాలూరు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ సురక్షింతగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details