విజయనగరం జిల్లా కీలకమైన వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదగా గేట్లను ఎత్తే కార్యక్రమం జరిగింది. ఈ సీజన్ లో ప్రాజెక్టు నిండటంతో ఖరీఫ్ డోకా లేదని ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్ద్యంతో 3 వేల మంది రైతులకు నీరు సరఫరా కావాల్సి ఉండగా, ప్రాజెక్టు అసంపూర్తితో ప్రస్తుతం కేవలం 1300 మందే లబ్ది పొందుతున్నారని ఆయన అన్నారు. అలాగే, ప్రాజెక్టు నిర్వహణకు 40 మంది సిబ్బంది కావాల్సి ఉండగా, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు సమస్యలపై కలెక్టర్ తో నివేదిక రూపొందించి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, ప్రాజెక్టును ఆధునికీకరణ కు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.
వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల - లక్ష్మీపురం
విజయనగరం జిల్లా వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు నీరు వదిలారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి లు పాల్గొన్నారు.
కుడి ఎడమ కాలువలకు నీరు విడుదల