ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులతో సమావేశమైన జిల్లా ఎస్పీ..

విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసులకు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. బయట ప్రాంతాల్లో విధులు నిర్వహించిన పోలీసులు నేరుగా ఇళ్లకు వెళ్లకుండా డీటీసీలో పోలీసు సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండాలన్నారు.

viziangaram dst sp rajakumari  conduct meeting with police about corona measurements
viziangaram dst sp rajakumari conduct meeting with police about corona measurements

By

Published : Jul 4, 2020, 12:23 PM IST

విజయనగరం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసు సిబ్బందిలో అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసు పరేడ్ గ్రౌండులో సమావేశమయ్యారు.

కరోనా వ్యాధి ప్రబలకుండా క్షేత్ర స్థాయిలో పని చేసే పోలీసు సిబ్బంది అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు.

బయట ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఎవ్వరూ నేరుగా తమ ఇళ్లకు వెళ్లవద్దని, వైద్య పరీక్షలు నిర్వహించి, రిపోర్టులు వచ్చే వరకు డీటీసీలో పోలీసు సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండాలన్నారు.

కరోనా వ్యాధి లక్షణాలైన పొడి దగ్గు, జ్వరం, గొంతునొప్పి మొదలైనవి కనిపిస్తే వెంటనే కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా వ్యాధిని జయించేందుకు శరీరంలో ఇమ్యూనిటీ శక్తిని పెంచుకొనేందుకు వ్యాయామం, యోగా, మెడిటేషను వంటివి చేయాలని సూచించారు.

ఇదీ చూడండి

కరెన్సీ శానిటైజర్ బాక్స్: వాల్తేర్​ డీజిల్ షెడ్​ ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details