ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గడిగెడ ప్రాజెక్టును సందర్శించిన పురపాలక బృందం'

విజయనగరం పట్టణ వాసుల దాహార్తికి కొంత మేర ఉపశమనం కలిగించనున్నగడిగెడ్డ ప్రాజెక్టు పనులను పురపాలక సంఘం ఛైర్మన్... కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు.

'గడిగెడ ప్రాజెక్టును సందర్శించిన పురపాలక బృందం'

By

Published : May 17, 2019, 7:23 PM IST

'గడిగెడ ప్రాజెక్టును సందర్శించిన పురపాలక బృందం'

విజయనగరం జిల్లా గుర్లలోని గడిగెడ్డ ప్రాజెక్టును పురపాలక సంఘం చైర్మన్ రామకృష్ణ సందర్శించారు. సుమారు 25 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను... చైర్మన్ తో పాటు కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్​తో నగరం ప్రజలకు 12టీఎంసీల నీటిని అందించనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు.

ఏంటీ ఈ ప్రాజెక్ట్...?
తోటపల్లి ప్రాజెక్టు నీటిని.. కాలువల ద్వారా గడిగెడ్డ వరకు తీసుకువస్తారు. అక్కడి నుంచి పైపులు ద్వారా విజయనగరం పట్టణ ప్రజలకు త్రాగునీరు ను అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విజయనగరం ప్రజల తాగునీటికి ఎద్దడి నుంచి కొంత వరకూ ఉపశమనం కలగనుంది.

ఇవీ చూడండి-తెదేపా ఫిర్యాదుపై సీఎస్ స్పందన.. సీఈవోకు నోట్

ABOUT THE AUTHOR

...view details