ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నిర్ధరణ అయినా..సచివాలయ పరీక్ష రాయొచ్చు'

విజయనగరం జిల్లాలో సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించి జాయింట్ కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా నిర్ధరణ అయినవారు కూడా..పరీక్ష రాయొచ్చని జేసీ తెలిపారు.

vizianagaram jc meeting on sachivalayam exams
విజయనగరంజిల్లాలో సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష

By

Published : Sep 18, 2020, 11:18 PM IST

ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించి విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆడిటోరియంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా నిర్ధారణ అయిన వారిని కూడా సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు అనుమతిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. వీరికోసం ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక గదిలో పీపీఈ కిట్లను ధరించి అధికారులు ఇన్విజిలేషన్ చేస్తారని తెలిపారు. విజయనగరం, ఎస్.కోట గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం 5 క్లస్టర్లలో 88 పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు.

పరీక్షల వేళలకు అనుగుణంగా ప్రస్తుతం తిరుగుతున్న బస్సులతో పాటు అదనంగా 30 బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించామన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేసి, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపడతామన్నారు.

ఇదీ చూడండి.వైకాపా పార్లమెంట్​ను తప్పుదోవ పట్టిస్తోంది: ఎంపీ గల్లా జయదేవ్

ABOUT THE AUTHOR

...view details