విజయనగరంలో గతంలో రోజుకు 60 వరకు లైట్ల నిర్వహణ ఉండగా.. ఇప్పుడు 30కు పరిమితమైంది. ఖాదర్‌నగర్, బాబామెట్ట, కొండపల్లివారి తోట తదితర చోట్ల పిడుగుపాటు, తీగలు పడిపోయి దీపాలు కాలిపోయాయి. ఈపీడీసీఎల్‌కు నగర పాలక సంస్థ డబ్బులు చెల్లించినా లాక్‌డౌన్ వల్ల పనుల జాప్యం జరుగుతోంది. నగరంలో అన్ని రకాల దీపాలు 14,303 వరకు ఉండగా..వీటిలో 13,037 దీపాల నిర్వహణ.. ఈఈఎస్‌ఎల్ ఆధ్వర్యంలో సాగుతోంది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు.
విధీ దీపాలు లేని విజయనగరం - విజయనగరంలో లాక్‌డౌన్
విజయనగరం పట్టణం... కొద్ది నెలల కిందే పురపాలక సంఘం నుంచి నగర పాలక సంస్థగా ఎదిగింది. అయినా.. చాలాచోట్ల రాత్రిళ్లు వీధి దీపాలు లేక జనం అవస్థలు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ వేళ.. పోలీసులు విధులు నిర్వహించేందుకూ ఈ పరిస్థితి సమస్యగా మారింది.
వెలుగని వీధిదీపం