ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిప్యూటీ మేయర్ నాగలక్ష్మి మృతి - vizianagaram deputy mayor nagalakshmi died

విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నాగలక్ష్మి మృతి చెందింది. కరోనాతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

vizianagaram deputy mayor nagalakshmi died with corona
డిప్యూటీ మేయర్ నాగలక్ష్మి మృతి

By

Published : May 5, 2021, 11:13 AM IST

విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి(47) మంగళవారం రాత్రి మృతి చెందారు. దీన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యం కారణంగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకటో డివిజన్ నుంచి గెలుపొందారు. మార్చి 18న డిప్యూటీ మేయరుగా బాధ్యతలు స్వీకరించారు. నాగలక్ష్మీకి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలున్నారు. పూల్​బాగ్ విజయలక్ష్మీ నగర్​లో నివాసం ఉంటున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే మృతి చెందడంపై బంధువులు, వైకాపా నాయకులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details