ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి'

రానున్న రోజుల్లో కరోనా వైరస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.. విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ సూచించారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిథులతో సమావేశం నిర్వహించి.. తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలకపాత్ర పోషించాలన్నారు.

vizianagaram collector meeting with officers and organisations
స్వచ్ఛంద సంస్థ ప్రతినిథులతో విజయనగరం కలెక్టర్ సమావేశం

By

Published : Jun 8, 2020, 7:34 PM IST

సర్వేల ప్రకారం రానున్న రోజుల్లో కరోనా కేసులు మరింత పెరుగుతాయని.. లాక్ డౌన్ సడలిపంపులను కూడా దృష్టిలో పెట్టుకుని వైరస్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని.. విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ సూచించారు. కలెక్టరేట్ లో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు కొవిడ్-19పై అవగాహన కల్పించాలని వారికి సూచించారు. జిల్లాలో ఉపాధి కూలీలు ఎక్కువగా ఉన్నారని.. జీవనోపాధి కోసం వారు పనికి వెళ్లక తప్పదని అన్నారు.

కరోనా జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగాన్ని తప్పనిసరి చేయాలన్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకకుండా ఉండవచ్చునని చెప్పారు. ప్రతిఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వీటన్నింటిపై అవగాహన కల్పించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details