ETV Bharat / state
పార్వతీపుత్రునికి అగ్నిమాపక యంత్రంతో నిమజ్జనం - idol
విజయనగరంలో వినూత్నంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. అగ్నిమాపక యంత్రం సాయంతో విగ్రహాన్ని ప్రతిష్ఠంచిన చోటే నిమజ్జనం చేశారు.
వినాయకుడు
By
Published : Sep 12, 2019, 7:06 AM IST
| Updated : Sep 12, 2019, 9:27 AM IST
వినూత్నంగా వినాయక నిమజ్జనం విజయనగరంలోని ఏడు కోవెళ్ల ప్రాంగణంలో నెలకొల్పిన మట్టి వినాయకున్ని అదే చోట నీటితో నిమజ్జనం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకున్ని ఆలయ కమిటీ వారు ప్రతిష్ఠించారు. నవ రాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు అందించారు. చివరి రోజు ఘనంగా అభిషేకాలు నిర్వహించి.. ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే నిమజ్జనం చేశారు. అగ్నిమాపక యంత్రంతో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని తిలకించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే మట్టితో వినాయకున్ని రూపొందించి.... ఇక్కడే నిమజ్జం చేశామని ఏడు కోవెల ప్రధాన అర్చకుడు తెలియచేశారు. Last Updated : Sep 12, 2019, 9:27 AM IST