తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడిని అందించే చోడి(రాగులు) వంగడం వీఆర్1101(ఇంద్రావతి)ను విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఖరీఫ్, రబీ సీజన్లలో విత్తుకోవచ్చని, పంట కాలపరిమితి 115 రోజులని, హెక్టారుకు 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వేసుకొనేందుకు అనుకూలమన్నారు.
గురువారం దిల్లీ నుంచి జూమ్ డిజిటల్ ద్వారా నిర్వహించిన చిరుధాన్యాల జాతీయ సదస్సులో ఐకార్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన మహాపాత్రో ఈ నూతన వంగడాన్ని విడుదల చేశారు.