విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ బి.మల్లయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు విధివిధానాలను , దస్త్రాలను పరిశీలించారు. 100 కేజీలకు 8 కేజీలు మిల్లర్స్ మార్జిన్ అడుగుతున్నారని రైతులు విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ కు తెలిపారు. అలాగే మిల్లర్లు రైతు భరోసా కేంద్రాల వద్దకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారా.. లేదా అని అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన రైతుల సమస్యలను జిల్లా అధికారులకు దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన అన్నారు.
రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ - విజయనగరం తాజా వార్తలు
విజయనగరంలోని రైతు భరోసా కేంద్రాల్లో విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ బి.మల్లయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు విధివిధానాలను పరిశీలించారు. అలాగే అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్