విజయనగరం జిల్లాలో కూరగాయల ధరలు(Vegetable prices high) దడ పుట్టిస్తున్నాయి. గులాబ్ తుపాను కారణంగా జిల్లాలో 80శాతానికి పైగా పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. పెరుగుతున్న ధరలు.. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు గుదిబండగా మారాయి. టమాటా ధరలు గతంలో పోల్చితే రెట్టింపయ్యాయి. రైతుబజార్లలో కిలో 30 నుంచి 35రూపాయలు ఉండగా... బహిరంగ మార్కెట్లో కిలో 60 రూపాయల వరకు పలుకుతోంది. దాదాపు అన్నిరకాల కూరగాయలూ కిలో 5నుంచి 20రూపాయలు వరకూ పెరిగాయి. ఏటా కార్తీక మాసంలో కూరగాయల ధరలు పెరగడం సహజమే అయినా... ఈ ఏడాది ముందుగానే ధరలు ఆకాశాన్నంటాయి.
gulab effect: గులాబ్ దెబ్బ... కొండెక్కిన కూరగాయల ధరలు
గులాబ్ తుపానుతో పంటలు దెబ్బతిని దిగుబడులు(gulab effect) తగ్గాయి. ఫలితంగా కూరగాయల ధరలు(Vegetable prices high) కొండెక్కాయి. అమాంతం పెరిగిన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
విజయనగరం జిల్లాలో ఏటా ఈ సమయానికి జిల్లా నలుమూలల నుంచి వంకాయలు, చిక్కుడు, బీర, దొండ, బెండ వంటి కూరగాయలు పెద్దఎత్తున మార్కెట్‌కు వచ్చేవి. అతివృష్టి, అనావృష్టి కారణంగా.. రైతుబజార్లకు కూరగాయల రాక తగ్గింది. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. 100 రూపాయలతో వారానికి సరిపడా వచ్చే కూరగాయలకు ప్రస్తుతం 500 వరకు వెచ్చించాల్సి వస్తోందని కొనుగోలుదారులు వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు రైతులను నష్టపరచగా.. వినియోగదారులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కొనుగోలుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి