ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరస్వతీ ఆలయాల్లో వైభవంగా వసంత పంచమి - VASANTHA PANCHAMI

విజయనగరం జిల్లాలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని సరస్వతీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

VASANTHA PANCHAMI
వైభవంగా వసంత పంచమి వేడుకలు

By

Published : Jan 30, 2020, 5:33 PM IST

వైభవంగా వసంత పంచమి వేడుకలు

విజయనగరంలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల విద్యలకు అధిదేవత అయిన అమ్మవారి విగ్రహాన్ని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, ఫల, పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం.. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా.. ఒడిశా, ఛత్తీస్​గడ్ రాష్ట్రాల నుంచీ భారీగా భక్తులు తరలొచ్చారు. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని.. తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం.. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details